పక్కా ప్రణాళికతో హైడ్రా పనిచేస్తుంది: రంగనాథ్
TG: హైడ్రా నిర్వహణపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాదిలో హైడ్రాకు ఎన్నో మంచి, చెడు అనుభవాలు ఎదురయ్యాయని చెప్పారు. ఏడాదిలో 500 ఎకరాల ప్రభుత్వ స్థలాలను పరిరక్షించామని, వాటి విలువు దాదాపు రూ.30 వేల కోట్లపైనే ఉంటుందని తెలిపారు. ఆరు చెరువులను పునరుద్ధరిస్తున్నామని, వాటి విస్తీర్ణం రెట్టింపు స్థాయిలో పెరిగిందని పేర్కొన్నారు. పక్కా ప్రణాళికతో హైడ్రా పనిచేస్తుందని రంగనాథ్ వివరించారు.