హైదరాబాద్, అక్టోబర్ 16
హైదరాబాద్ జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ (డీఓపీటీ) ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ స్టే ఇవ్వడానికి నిరాకరించడంతో, డీవోపీటీ విధించిన గడువు బుధవారం ముగుస్తున్నందున, ఆమె ఏపీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం ఆమె స్థానంలో హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్‌ను ఇన్‌చార్జ్ కమిషనర్‌గా నియమించే అవకాశమున్నట్టు సమాచారం.