నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులు – ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులు – ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులు – ఏలేటి మహేశ్వర్ రెడ్డి



₹144.51 కోట్లతో రోడ్ల అభివృద్ధి – అదనంగా ₹18.70 కోట్లతో పట్టణ సీసీ రోడ్లు, డ్రైనేజీలు – బీరవెల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పునరుద్ధరణకు రూ.69.10 లక్షలు



నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించబడ్డాయి. హైబ్రిడ్ ఆన్యూటీ మోడ్‌ (హమ్) ద్వారా పంచాయతీరాజ్‌, R&B శాఖల రోడ్ల అభివృద్ధికి ₹144.51 కోట్లు మంజూరయ్యాయి. అదనంగా నిర్మల్ పట్టణాభివృద్ధికి ₹18.70 కోట్లు, బీరవెల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పునరుద్ధరణకు రూ.69.10 లక్షలు కేటాయించబడ్డాయని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు.



నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. బీజేపీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆదివారం వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం, హైబ్రిడ్ ఆన్యూటీ మోడ్‌ (హమ్) ద్వారా పంచాయతీ రాజ్‌, రోడ్డు భవనాల శాఖల పరిధిలో మొత్తం ₹144.51 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా 28 రోడ్లకు రూ.69 కోట్లతో 84.4 కిలోమీటర్ల మేర రోడ్ల పనులు మంజూరయ్యాయి. దిలావర్‌పూర్‌, లక్ష్మణ్‌చందా, మామడ, నర్సాపూర్‌, నిర్మల్ రూరల్‌, సారంగాపూర్‌, సాన్‌ మండలాల్లో ప్రధాన రోడ్లను అభివృద్ధి చేయనున్నారు.

అదేవిధంగా, R&B శాఖ ద్వారా మూడు ప్రధాన రోడ్ల అభివృద్ధికి రూ.75.51 కోట్లు కేటాయించబడ్డాయి. వీటిలో పాత NH-7 రోడ్‌, నిర్మల్ టౌన్ అప్రోచ్ రోడ్‌, సిర్గాపూర్‌–కౌట్ల రోడ్‌ ఉన్నాయి.

నిర్మల్ పట్టణ అభివృద్ధికి అదనంగా ₹3.70 కోట్లు మంజూరయ్యాయి. గతంలో మంజూరైన ₹15 కోట్లతో కలిపి మొత్తం ₹18.70 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజ్‌లు, ఇతర మౌలిక వసతుల పనులు చేపడతామని తెలిపారు. బీరవెల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పునరుద్ధరణ పనులకు రూ.69.10 లక్షలు కేటాయించబడ్డాయి.

ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధి మా ప్రధాన లక్ష్యం. అన్ని గ్రామాలు, పట్టణాలు రోడ్లతో అనుసంధానమై అభివృద్ధి దిశగా సాగాలని కృషి చేస్తున్నాం. త్వరలో పనులు ప్రారంభమవుతాయి,” అని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment