స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు ఎంత ఖర్చు పెట్టాలి…

స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు ఎంత ఖర్చు పెట్టాలి...

స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు ఎంత ఖర్చు పెట్టాలి…

జెడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల ఖర్చు పరిమితిని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది.

జెడ్పిటిసి అభ్యర్థి రూ 4 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థి రూ 1, 50 లక్షల వ్యయ పరిమితి ఉంది. అభ్యర్థులు పోటీ చేసే ప్రాంతంలో రాజకీయ పార్టీలు చేసే ఖర్చు కూడా అభ్యర్థి ఖాతాలోనే జమవుతుంది.

సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి 2011 జనాభా లెక్కల ప్రకారం 5వేల జనాభా కంటే ఎక్కువ ఉన్న గ్రామపంచాయతీకి రూ 2,50 లక్షలు, వార్డు సభ్య అభ్యర్థి రూ 50 వేలు, 5వేల జనాభా కంటే తక్కువ ఉన్న గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి రూ 1,50 లక్షలు, వార్డు సభ్య అభ్యర్థి రూ 30 వేలు వ్యయం చేయడానికి పరిమితి ఉంది.

జడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు 45 రోజుల్లో తమ ఎన్నికల ఖర్చుల తుది నివేదికలు సంబంధిత అధికారికి సమర్పించాలి. ఎన్నికల వ్యయ ఖర్చులు సమర్పించినట్లయితే గగెలిచిన పదవి కోల్పోవడంతో పాటు, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీకి అనార్హులవుతారు.

Join WhatsApp

Join Now

Leave a Comment