కామారెడ్డి జిల్లాలో ఆర్యవైశ్య సంఘ నాయకుల సన్మానం
మనోరంజని తెలుగు టైమ్స్ – ఎల్లారెడ్డి, డిసెంబర్ 05
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో నూతనంగా ఎన్నికైన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శ్రీధర్, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కిషన్ గుప్తా, ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి ముత్యపు సుదర్శన గుప్తాను మాజీ జడ్పీటీసీ ల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ఆర్యవైశ్య సంఘ అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి కొత్తగా ఏర్పడిన కమిటీ మరింత కృషి చేస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కిష్టయ్య , తదితరులు పాల్గొన్నారు