బదిలీపై వెళ్తున్న ప్రిన్సిపల్ కు సన్మానం
మనోరంజని : ( ప్రతినిధి )
ముధోల్ : డిసెంబర్ 12
నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బదిలీపై వెళ్తున్న ప్రిన్సిపల్ కైసర్ పాష- అధ్యాపకులు ఆయేషా అర్షియా- నాన్ టీచింగ్ స్టాఫ్ దామోదర్, లింగయ్య, నర్మదాబాయిలకు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిర్మల్ జిల్లా డిఐఈఓ పరశురాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సహజమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కుమార్, జిల్లా జూనియర్ లెక్చరర్ సంఘం అధ్యక్షులు వినోద్ కుమార్, అధ్యాపకులు గంగాధర్, నారాయణ, శ్రీనివాస్, ప్రశాంత్, రెహమాన్, శంషుద్దీన్, గణేష్, సురేష్, పద్మ, స్వరూపా, తదితరులు పాల్గొన్నారు