చరిత్ర మరువని వీరుడికి ఘన నివాళులు

చరిత్ర మరువని వీరుడికి ఘన నివాళులు

*ముధోల్ మనోరంజని ప్రతినిధి జులై 31*

ముధోల్ మండల కేంద్రములోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర్య సమర యోధుడు ఉద్ధమ్ సింగ్ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రార్థన సమయంలో ఉద్ధమ్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఉద్ధమ్ సింగ్ త్యాగాన్ని అతని పోరాటాన్ని పిల్లలకు వివరించారు. ఉద్ధమ్ సింగ్ చరిత్ర మరువని వీరుడని కొనియాడారు. పాఠశాల సమితి కార్యదర్శి ధర్మపురి సుదర్శన్, రిటైర్డ్ ఆంగ్ల ఉపాధ్యాయులు భగవాన్ దాస్, ప్రధానాచార్యులు సారథి రాజు, అకాడమిక్ ఇంచార్జీ స్వప్న శర్మ, ఆచార్యులు, విద్యార్థులు, తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment