బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మక విజయం

బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మక విజయం

బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మక విజయం

నిర్మల్ – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మక విజయమని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పొన్నం నారాయణ గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య సుదీర్ఘ పోరాట కృషి, అలాగే బీసీ సంఘాల దీర్ఘకాలిక ఉద్యమ ఫలితంగానే ఈ నిర్ణయం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

రిజర్వేషన్లు రాజ్యాంగ, చట్ట, న్యాయబద్ధమైనవని గుర్తుచేస్తూ, అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా రిజర్వేషన్లను వ్యతిరేకించే వర్గాలు కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తిగా గౌరవించి ఈ నిర్ణయానికి మద్దతు ఇవ్వాలని ఆయన మనవి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment