రబింద్రలో ఘనంగా హిందీ దివస్ వేడుకలు

రబింద్రలో ఘనంగా హిందీ దివస్ వేడుకలు

రబింద్రలో ఘనంగా హిందీ దివస్ వేడుకలు

ముధోల్ మనోరంజన్ ప్రతినిధి సెప్టెంబర్ 13

మండల కేంద్రమైన ముధోల్ లోని రబింద్ర స్కూల్ లో శనివారం హిందీ దివస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హిందీ భాషా ఉపాధ్యాయలకు సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు హిందీ భాష ప్రాముఖ్యతను, జాతీయ భాషగా దాని పాత్రను విద్యార్థులకు వివరించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అసంవార్ సాయినాథ్, కరస్పాండెంట్ రాజేందర్, డైరెక్టర్ పోతన్న యాదవ్, చైర్మన్ భీమ్ రావు దేశాయ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment