High Court: ఎన్నికలు ఎప్పుడు పెడతారు.. తెలంగాణ ప్రభుత్వం, ఈసీకి హైకోర్టు సూటి ప్రశ్న..

High Court: ఎన్నికలు ఎప్పుడు పెడతారు.. తెలంగాణ ప్రభుత్వం, ఈసీకి హైకోర్టు సూటి ప్రశ్న..

High Court: ఎన్నికలు ఎప్పుడు పెడతారు.. తెలంగాణ ప్రభుత్వం, ఈసీకి హైకోర్టు సూటి ప్రశ్న..

తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన స్థానిక సంస్థల ఎన్నికలపై దాఖలైన మరో పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. స్థానిక సంస్థల ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని సురేందర్ అనే న్యాయవాధి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఇక పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యల చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు కూడా ఎన్నికలకు వెళ్లాలని తెలిపినట్టు ఈసీకి కోర్టు గుర్తుచేసింది.

ఎన్నికలు పెట్టుకోవచ్చు అని సుప్రీం కోర్టు చెప్పింది కానీ.. కోర్టు ఆర్డర్స్‌ కాపీ మాత్రం ఎక్కడా లేదని ఈసీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. కానీ బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ నోటిఫికేషన్ ఇచ్చాం కాబట్టే దాన్ని సస్పెండ్ చేశామని.. ఈ విషయంపై గురువారమే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని ఈసీ తరపు న్యాయవాది తెలిపారు. ప్రభుత్వంతో చర్చించిన తరవాతే రీ నోటిఫికేషన్ ఉంటుందని.. ఇందుకోసం తమకు రెండు వారాల సమయం కావాలని ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈసీ తరపు న్యాయవాది ప్రతిపాదనకు అంగీకరించిన న్యాయస్థానం ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను రెండు వారాలకు వాయుదా వేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment