అగ్నివీర్లో ఎంపికైన యువకులకు ఘనంగా సన్మానం-
ఇటీవల విడుదలైన అగ్నివీర్ ఫలితాలలో ఎంపికైన కుబీర్ మండల కేంద్రంలోని మాన్పూర్ సతీష్, షేరే అక్షయ్, ఆకం సాయి ప్రసాద్ అనే యువకులకు ఈ రోజు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉత్తర తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సాప పండరి శాలువాతో ఘనంగా సన్మానించి, దేశానికి సేవ చేసుకునే అదృష్టాన్ని దక్కించుకున్న యువకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తల్లిదండ్రులకు, తమ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోల్శిక్ వార్ సతీష్, అలికే పోతన్న,సూది పీరాజి, కర్రోళ్ల సుదర్శన్ పలువురు పాల్గొన్నారు