పదవి విరమణ పొందిన ఉపాధ్యాయునికి సన్మానం
నిర్మల్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 30
నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని సిద్దుల కుంట ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న జీవశాస్త్ర ఉపాధ్యాయులు పదవీ విరమణ సందర్భంగ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులు పూలమాల పూలమాల శాలువా సన్మాన పత్రం, బహుమతులు అందజేసి ఘనంగా సన్మానించారు. తగలేపల్లి నరేందర్ దంపతులు అన్ని తరగతుల విద్యార్థులకు తన వంతుగా బ్యాగులు పెన్నులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందంతో పాటు వివిధ సంఘాల నాయకులు, బంధువులు, అభిమానులు పాల్గొన్నారు.