M4News
తేదీ: అక్టోబర్ 12, 2024
- ఉప్పల్ స్టేడియంలో భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ కు భారీ భద్రత ఏర్పాటు.
- 300 సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటు.
- వరుణుడి నుండి వర్షం పొంచి ఉంది, వాతావరణ శాఖ సమాచారం.
: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో శనివారం జరగనున్న భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 మ్యాచ్‌కు భారీ భద్రత ఏర్పాటు చేశారు. 300 సిసి కెమెరాలు ఉపయోగించి నిఘా ఏర్పాటు చేసినట్లు రాచకొండ సిపీ సుధీర్ బాబు తెలిపారు. వర్షం కురిసే అవకాశం ఉంది, కానీ ఉప్పల్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. క్రికెట్ ప్రేమికుల కోసం మెట్రో సేవలు అర్ధరాత్రి వరకూ అందుబాటులో ఉంటాయి.
: హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో శనివారం జరగనున్న భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 మ్యాచ్‌కు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. రాచకొండ సిపీ సుధీర్ బాబు తెలిపారు. 300 సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి, ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఇటీవల సిరీస్‌ను గెలుచుకున్న టీమిండియా, ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. మరోవైపు, బంగ్లాదేశ్ జట్టు మూడో టీ20లో గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది.
రానున్న మ్యాచ్‌కు వరుణుడి నుంచి ముప్పు పొంచి ఉంది, వాతావరణ శాఖ ఇప్పటికే వర్షం కురిసే అవకాశాన్ని తెలిపారు. కానీ ఉప్పల్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. టాస్ గెలిచిన టీమ్ ఫీల్డింగ్ ఎంచుకోవడం సాద్యమని భావిస్తున్నారు.
మ్యాచ్ సందర్భంగా క్రికెట్ అభిమానుల కోసం అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి.