భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం

భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం

భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం

పిడుగుపాటుతో మజీద్ మీనార్ ధ్వంసం

నీట మునుగుతున్న పంటలు ఆందోళన చెందుతున్న రైతులు

కోతకు గురైన రోడ్డు- రాకపోకలకు అంతరాయం

ముధోల్ మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 21

భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం

భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంభారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంభారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంభారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంభారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం

నియోజకవర్గ కేంద్రమైన ముధోల్తో పాటు ఆయా మండలాల్లో శనివారం అర్ధరాత్రి , ఆదివారం మధ్యాహ్నం వానలు దంచి కొడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. అలాగే పంటచేళ్లలో భారీగా వర్షం నీరు చెరింది. దీంతో చేతికొచ్చే సోయపంటకు వర్షం కారణంగా నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక నెల క్రితం కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను అధికారులు సర్వే చేశారు. నష్టపరిహారం ఇప్పటికీ అందకపోగా తాము ఉన్న కాస్త పంటలైన చేతికి వస్తే నిలదొక్కుకుంటామని అనుకున్న సమయంలోనే మళ్లీ వానలు కురవడంతో పంటలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. దీంతో తాము పూర్తిగా నష్టపోయే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. వానదేవుడు కరుణిస్తేనే ఉన్న కాస్త పంటలు చేతికి వచ్చే అవకాశం ఉన్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక తమ పరిస్థితి అగమ్నగోచరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆదివారం వేకువ జామున కురిసిన భారీ వర్షాలకు బోరిగాం- కరేగాం గ్రామాల మధ్య గలలో లోలేవల్ వంతెన పై నుండి వర్షం నీరు అధికంగా ప్రవహించడంతో లో లెవెల్ వంతెన వద్ద రోడ్డు కోతకు గురైంది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈవిషయం తెలుసుకున్న ఆర్ఐ నారాయణ పటేల్ సంఘటన స్థలాన్ని చేరుకొని కోతకు గురైన రోడ్డును పరిశీలించారు. ఈ విషయాన్ని సంబంధింత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే జేసిపితో కోతకు గురైన రోడ్డుకు తాత్కాలికంగా మరమ్మత్తులు చెయించారు. ప్రస్తుతం రాకపోకలు యదావిధిగా కొనసాగుతున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కోతకు వచ్చిన సోయతో పాటు పత్తి మొక్కజొన్న పంటలకు సైతం నష్టం వాటిలిందని రైతులు పేర్కొన్నారు. అధికారులు స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. అదేవిధంగా గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న కుంటలకు సైతం గండ్లు పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో సైతం పంట పొలాల్లో నీరు చేరిపోవడంతో పూర్తిగా మునిగిపోయాయి. ఏది ఏమైనా భారీ వర్షాలు రైతన్నతో పాటు సామాన్య ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు.

పిడుగుపాటుతో మజీద్ మినార్ ధ్వంసం…

మండల కేంద్రమైన ముధోల్ లోని నయాబదిలో లోగల మజీద్ పై (ప్రార్థన మందిరం) పై ఆదివారం వేకువజామున నాలుగు గంటలకు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షంతో ఒకేసారి పిడుగు పడటంతో మజీద్ పై ఉన్న మినార్ ధ్వంసం కావడంతో జరిగిందని మైనార్టీ మజీద్ నిర్వాహకులు తెలిపారు. దాదాపు మీనార్ విలువ 50 వేల వరకు ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా మజీద్ కు చుట్టుపక్కల ఉన్న ఇండ్లలోని ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోవడంతో నష్టం వాటిలిందని స్థానికులు పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment