హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

హైదరాబాద్‌, జులై 18: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, మెహదీపట్నం, మణికొండ, టోలిచౌకి, షేక్‌పేట్‌, గోల్కొండ, అత్తాపూర్, లంగర్‌హౌస్‌, బంజారాహిల్స్, తార్నాక, ఓయూ, నాచారం, మల్లాపూర్, హబ్సిగూడ, కూకట్‌పల్లి, కేపీహెచ్బీ, నిజాంపేట్‌, మియాపూర్‌, మూసాపేట్‌ సహా బాలానగర్‌, సనత్‌నగర్‌, ఎర్రగడ్డలో భారీ వర్షం కురుస్తోంది. అలాగే మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, కొండాపూర్‌, శేరిలింగంపల్లి, హకీంపేట్‌, కంటోన్మెంట్‌, ఖైరతాబాద్‌లోనూ భారీగా వర్షం పడుతోంది. ఆయా ప్రాంతాల్లో జనం అవస్థలు పడుతున్నారు.

మరోవైపు వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోగా.. పలువురు మెట్రో పిల్లర్ల కింద తలదాచుకున్నారు. కాగా, వర్షం నేపథ్యంలో అధికారులను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. వర్షం తగ్గేంత వరకూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు సూచనలు చేసింది.

ఇలా ఉండగా, తెలంగాణలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు (శనివారం) వరకూ తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో వానలు కురవనున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, రంగారెడ్డి వరంగల్, హనుమకొండ జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఆయా జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది..

Join WhatsApp

Join Now

Leave a Comment