పీచర (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 20
జాతీయ కీటక జనిత నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో పీచర గ్రామంలో అంటువ్యాధుల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. వర్షాల నేపథ్యంలో దోమల ద్వారా వ్యాపించే జ్వరాలు, డెంగ్యూ వంటి వ్యాధులను అరికట్టేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
పీచర గ్రామంలో జాతీయ కీటక జనిత నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో అంటువ్యాధుల నివారణ చర్యలు చేపట్టారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గ్రామంలో అంటువ్యాధులు, దోమల వలన వచ్చు జ్వరాలు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరోగ్య సహాయకుడు శివకృష్ణ గౌడ్ ప్రజలకు సూచనలు చేశారు.
మురికి కాలువలను శుభ్రం చేయించుకోవాలని, దోమలు వృద్ధి చెందకుండా గృహ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. డెంగ్యూ నివారణకు ప్రతి శుక్రవారం 'డ్రైడే' పాటించాలని, తద్వారా దోమల ఉత్పత్తిని అరికట్టవచ్చని తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా బయోటెక్ స్ప్రేను కూడా చేయించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిప్పని రాజేశ్వర్, ఆరోగ్య కార్యకర్త వనజ, ఆశ కార్యకర్త సునీత, పంచాయతీ కార్యదర్శి సాయి ప్రసాద్ పాల్గొన్నారు.












