సారంగాపూర్, జులై 17
ఫ్రైడేను డ్రైడేగా పాటించాలని ఎంపిఓ అజీజ్ ఖాన్ సూచించారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో ఆయన మురికి కాలువ పూడిక పనులు పర్యవేక్షించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిలిచిపోకుండా చూసుకోవాలని, దోమల నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
ఫ్రైడేను డ్రైడేగా పాటించాలని ఎంపిఓ అజీజ్ ఖాన్ సూచించారు. శుక్రవారం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో ఆయన మురికి కాలువ పూడిక తీయించారు. గ్రామ సర్పంచ్ చిన్నయ్య, ఆరోగ్య సిబ్బందితో కలిసి ఇంటి పరిసరాల్లోని కుండీలు, పాత సామాన్లలో నిల్వ ఉన్న నీటిని తొలగించి, నీరు నిలిచిపోకుండా చూసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎంపిఓ మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణ, ప్రజారోగ్య పరిరక్షణపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఎఎన్ఎం, ఆశావర్కర్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.











