పోచంపాడు (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 13
పోచంపాడులో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పలు పాఠశాలల్లో విద్యార్థులకు ఆల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేశారు. నులిపురుగుల నివారణ, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం పిల్లల ఆరోగ్యం, పోషకాహార స్థితి, విద్యాభివృద్ధికి తోడ్పడుతుందని వైద్యాధికారులు తెలిపారు.
పోచంపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం (NDD) సందర్భంగా తెలంగాణ బాలుర రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల మరియు బాలికల సోషల్ వెల్ఫేర్ పాఠశాల & కళాశాలలో విద్యార్థులకు ఆల్బెండాజోల్ (నులిపురుగుల నివారణ) మాత్రలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డా. వేకన్న, పోచంపాడు పీహెచ్సీ వైద్యాధికారి డా. మద్దుల రాకేష్, హెల్త్ ఎడ్యుకేటర్ ఆఫీసర్ శ్రీ వేణుగోపాల్, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీ మురళి, సూపర్వైజర్ శ్రీమతి వనమాల, ఏఎన్ఎంలు మరియా ఎస్తేర్, ఆశా కార్యకర్తలు సునీత, స్వరూప, అరుణ, పద్మ పాల్గొన్నారు. వీరంతా విద్యార్థులకు నులిపురుగుల నివారణ, వ్యక్తిగత పరిశుభ్రత మరియు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ మహిపాల్ రెడ్డి మరియు ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పిల్లలకు ఆల్బెండాజోల్ మాత్రలు ఇవ్వడం ద్వారా నులిపురుగుల సమస్యను నివారించడంతో పాటు పిల్లల ఆరోగ్యం, పోషకాహార స్థితి మరియు విద్యాభివృద్ధికి తోడ్పాటు అందుతుందని తెలిపారు.











