Nirmal/Tanur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 31
మండల కేంద్రమైన ముథోల్‌లోని ఓ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం పాము కలకలం సృష్టించింది. ఉదయం బాత్రూంలో బకెట్ కింద పామును గుర్తించడంతో, పిల్లలు రాకముందే ప్రమాదం తప్పింది.
మండల కేంద్రమైన ముథోల్‌లోని ఓ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం పాము కనిపించడంతో కలకలం రేగింది. ఉదయం అంగన్వాడీ కేంద్రంలోని బాత్రూంలో ఉన్న బకెట్ కింద పామును ఆయమ్మ గమనించారు. పామును చూసిన ఆమె ఒక్కసారిగా భయాందోళనకు గురై కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు.
బకెట్ కింద ఉన్న పామును గుర్తించిన స్థానికులు దానిని బయటకు తీసి చంపివేశారు. ఈ ఘటన సమయంలో చిన్నారులు ఇంకా అంగన్వాడీ కేంద్రానికి చేరుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు.
అంగన్వాడీ కేంద్రం పరిసరాల్లో పాములు సంచరించకుండా శుభ్రత చర్యలు చేపట్టడంతో పాటు, కేంద్రంలోని బాత్రూంలు, గదులు పరిసర ప్రాంతాలను అధికారులు క్రమం తప్పకుండా పరిశీలించాలని స్థానికులు కోరారు.












