Prakasam/Ballikurava (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 04
నిర్మల్ జిల్లా కుబీర్ మండలానికి చెందిన చిమ్మన్వార్ పుష్పలత తన కుమారుడి ప్రాణాలను కాపాడాలని దాతలను వేడుకుంటున్నారు. మెదడు కణితితో బాధపడుతున్న బాలుడి చికిత్సకు ఆర్థిక సాయం కోరుతున్న ఈ కుటుంబం, ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
నిర్మల్ జిల్లా కుబీర్ మండలానికి చెందిన చిమ్మన్వార్ పుష్పలత తన కుమారుడి ప్రాణాలను కాపాడాలని దాతలను వేడుకుంటున్నారు. భర్తను కోల్పోయిన ఆమె మిషన్ కుట్టే పనితో ఇద్దరు కుమారులను చదివిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
ఇటీవల ఆమె కుమారుడికి మెదడులో కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. గత ఏడాది కాలంగా హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించిన అనంతరం ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో వైద్యం కొనసాగుతోంది. కుమారుడిని కాపాడేందుకు పుట్టింటి వారి సహాయంతో అప్పులు చేసి చికిత్స చేయించినప్పటికీ, ప్రస్తుతం మరింత చికిత్సకు అవసరమైన ఆర్థిక వనరులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయం అందించి బాలుడి చికిత్సకు చేయూతనివ్వాలని పుష్పలత విజ్ఞప్తి చేశారు.
సహాయం అందించాలనుకునే వారు ఈ ఫోన్‌పే నంబర్లను సంప్రదించవచ్చు: 9603225356 (రవీ), 9010015253 (రాజేందర్).











