మిర్యాలగూడ, జులై 1
మిర్యాలగూడలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నిరంతరం ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులను సన్మానించి, వారి సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, లయన్స్ క్లబ్ సభ్యులు, ప్రముఖులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు కూటాల రాంబాబు ఆధ్వర్యంలో బుధవారం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని (డాక్టర్స్ డే) ఘనంగా నిర్వహించారు. నిరంతరం అన్ని వర్గాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల సేవలను ప్రశంసిస్తూ, వారికి శాలువాలు, పూలమాలలతో మెమోంట్లను అందజేసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు కూటాల రాంబాబు మాట్లాడుతూ, వైద్య సేవలు అందించడంలో వైద్యుల పాత్ర అమోఘమైనదని, వైద్యులకు సమాజంలో ఎప్పుడూ ఉన్నత స్థానం ఉంటుందని అన్నారు.
మిర్యాలగూడ ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ అశ్విన్ కుమార్, డాక్టర్ జాడి రాజు, డాక్టర్ మహానంది చౌదరి, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ సుష్మ, డాక్టర్ స్వాతి, డాక్టర్ రవికుమార్, డాక్టర్ ఉజ్వల, డాక్టర్ వాసంతి, డాక్టర్ ఇంటూరి శ్రీనివాసరెడ్డి తో పాటు ఎల్.సి.ఐ.ఎఫ్, జిఎంటి కోఆర్డినేటర్ లయన్ కర్నాటి రమేష్, ముక్కపాటి వెంకటేశ్వరరావు, భాగ్యలక్ష్మి మురహరి, ప్రముఖ పారిశ్రామికవేత్త లయన్ రంగ శ్రీధర్, నాయుడు, యనగండ్ల లింగయ్య, తరుణ అధ్యక్షులు అనుముల సైదిరెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.











