Nirmal/Lokeshwaram (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 01
లోకేశ్వరం మండలం కనకాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పల్లె దవాఖానను సర్పంచ్ సిందే సునీల్, ఉప సర్పంచ్ గంగన్న, మండల పంచాయతీ అధికారి సల్మాన్ రాజ్, పంచాయతీ సెక్రెటరీ సుధాకర్ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య సేవల పరిస్థితి, మందుల లభ్యత, పరిశుభ్రతతో పాటు ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై అధికారులు సమీక్షించారు.
లోకేశ్వరం మండలం కనకాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పల్లె దవాఖానను సర్పంచ్ సిందే సునీల్, ఉప సర్పంచ్ గంగన్న, మండల పంచాయతీ అధికారి సల్మాన్ రాజ్, పంచాయతీ సెక్రెటరీ సుధాకర్ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పల్లె దవాఖానలో వైద్య సేవల పరిస్థితి, మందుల లభ్యత, పరిశుభ్రత అంశాలను అధికారులు సమీక్షించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచనలు చేశారు.
అలాగే ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన పలు ఫిర్యాదులను కూడా ఈ సందర్భంగా పరిశీలించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్యుత్ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులపై చర్చించి, వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సిందే సునీల్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి పనులను ప్రజల అవసరాలకు అనుగుణంగా వేగవంతం చేస్తున్నామని తెలిపారు. పల్లె దవాఖాన ద్వారా గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.
మండల పంచాయతీ అధికారి సల్మాన్ రాజ్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో ఆరోగ్య కేంద్రాల పనితీరును మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సల్మాన్ రాజ్, గ్రామ సర్పంచ్ సిందే సునీల్, ఉప సర్పంచ్ గంగన్న, పంచాయత్ సెక్రెటరీ సుధాకర్ మరియు ఆశ వర్కర్స్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.












