కామారెడ్డి, 2026-09-02
కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో అశ్విని అందిస్తున్న సేవలను పలువురు ప్రజలు అభినందిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ ఓపికగా, బాధ్యతగా రక్త పరీక్షలు నిర్వహిస్తూ తన సేవాభావాన్ని చాటుకుంటున్నారని వారు పేర్కొన్నారు.

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా రోగుల పట్ల ఆప్యాయతతో వ్యవహరిస్తూ, రక్త పరీక్షల విషయంలో ప్రతి ఒక్కరికీ సహకరిస్తున్న అశ్విని సేవలు అభినందనీయమని ప్రజలు అన్నారు. ఆమె వంటి సేవాభావం కలిగిన సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో అశ్విని సేవలు అందించడం పట్ల పరిసర ప్రాంతాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సేవాభావం కలిగిన మరింత మంది సిబ్బంది కామారెడ్డికి రావాలని భగవంతుడిని కోరుకుంటున్నామని ప్రజలు తెలిపారు.
ప్రశంసలు
ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందిస్తున్న అశ్వినికి కామారెడ్డి మీడియా ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేశారు.