డెంకడ, జూలై 14
నిర్మల్ జిల్లాలోని కడెం మండల కేంద్రంలో ప్రజలకు అందుబాటులో ఉన్న అత్యవసర వైద్య అంబులెన్స్‌ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, కడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శివతో కలిసి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్‌లోని వైద్య సేవలు, ఆక్సిజన్ నిల్వలు, మందులు, పరికరాల పనితీరును పరిశీలించారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని కడెం మండల కేంద్రంలో ప్రజలకు అందుబాటులో ఉన్న అత్యవసర వైద్య అంబులెన్స్‌ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, కడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శివతో కలిసి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తనిఖీలో భాగంగా అంబులెన్స్‌లో అత్యవసర పరిస్థితుల్లో అవసరమయ్యే వైద్య సేవలు, ఆక్సిజన్ నిల్వలు, ప్రాణరక్షక మందులు, వైద్య పరికరాలు, వాటి పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు.
అత్యవసర సమయాల్లో రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదుపాయాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
అంబులెన్స్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి సమయానికి సేవలు అందించాలని, వాహనంలో అవసరమైన మందులు, పరికరాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా అత్యవసర వైద్య సిబ్బంది సేవా సిబ్బంది, వాహన చోదకుడు రాకేష్ విధి నిర్వహణలో చూపుతున్న నిబద్ధతను అధికారులు అభినందించారు. ప్రజలకు నాణ్యమైన అత్యవసర వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని స్పష్టం చేశారు.












