మక్కాకు వెళ్లే హాజ్ యాత్రికుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని, నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు, నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరిండెంట్ గోపాల్ సింగ్ నేతృత్వంలో బుధవారం హాజ్ యాత్రికులకు మెడికల్ స్కానింగ్ జరిగింది.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హాజ్ యాత్రకు వెళ్లే సుమారు 38 మంది యాత్రికులకు మెనింగో, కోకల్ వ్యాక్సిన్లతో పాటు సీజనల్ ఇన్ఫ్లూయెంజా వ్యాక్సిన్లు అందించారు. దీనితో పాటు, రక్త పరీక్షలు, బీపీ, షుగర్ వంటి ఆరోగ్య పరీక్షలు కూడా చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ సమత, డాక్టర్లు రమేష్, ప్రశాంత్, నర్సింగ్ సూపరిండెంట్ గ్రేడ్ వన్ ఆఫీసర్ వనజ, గ్రేడ్ 2 ఆఫీసర్ విజయలక్ష్మి, ల్యాబ్ ఇంచార్జ్ అనిల్ మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
యాత్రికులకు అవసరమైన వైద్య సలహాలు, సూచనలు కూడా అందించినట్లు అధికారులు తెలిపారు. ఆరోగ్యంగా యాత్రను పూర్తి చేయడానికి ఈ పరీక్షలు దోహదపడతాయని పేర్కొన్నారు.












