SPSR Nellore/Dagadarthi (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 31
మెండోరా మండలంలోని పోచంపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్వో) డాక్టర్ రాజశ్రీ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆస్పత్రి పనితీరును క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె, ఓపీ సేవలు, ఏఎన్సీ సేవలు, టీకాల కార్యక్రమం, ప్రసవ గది, రిజిస్టర్లు, మందుల నిల్వలను తనిఖీ చేశారు.
మెండోరా మండలంలోని పోచంపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్వో) డాక్టర్ రాజశ్రీ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి, ఆస్పత్రి పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఓపీ సేవలు, గర్భిణీలకు అందిస్తున్న ఏఎన్సీ సేవలు, రోగనిరోధక టీకాల కార్యక్రమం, ప్రసవ గది (లేబర్ రూమ్), ఐఎల్ఆర్ గది, వివిధ రిజిస్టర్లు, మందుల నిల్వలు, ఆరోగ్య సేవల నిర్వహణను తనిఖీ చేశారు.
అనంతరం పీహెచ్సీ సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అన్ని రికార్డులను సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను నాణ్యతతో అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరుపై డాక్టర్ రాజశ్రీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సేవాభావంతో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సిబ్బందిని అభినందించారు.
ఈ తనిఖీలో వైద్యాధికారి డాక్టర్ ముద్దుల రాకేష్, డాక్టర్ అనిల్, నర్సింగ్ అధికారులు నిస్సి, భారతి, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.












