యోగ సాధనతోనే సంపూర్ణ ఆరోగ్యం

యోగ సాధనతోనే సంపూర్ణ ఆరోగ్యం

యోగ సాధనతోనే సంపూర్ణ ఆరోగ్యం

బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్

తానుర్ మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 12

యోగ సాధన తోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని సంచరించుకోవచ్చు అని భైంసా ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్ అన్నారు. తానూర్ మండల కేంద్రంలోని డ్రీస్కవరీ డ్రీమ్స్ స్కూల్ వారి ఆధ్వర్యంలో ఎంఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా స్థాయి పోటీలు ఘనంగా జరిగాయి. ఈ పోటీలకు భైంసా ఏఎంసీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్, మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటి చైర్మన్ మాట్లాడుతూ యోగాసనాలు వేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చని, ఇది మన జీవితంలో చురుకుదనాన్ని పెంచుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని సూచించారు. జిల్లా యోగా అసోసియేషన్ త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు విజేతలుగా నిలిచి నిర్మల్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు వాడేకర్ లక్ష్మణ్, అమద్ ఖాన్, కృష్ణ తదితరులు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రాచపోతన్న, ప్రధాన కార్యదర్శి ఉప్పు రవీందర్, కోశాధికారి వీరట్టపల్లి సాయినాథ్, జాయింట్ సెక్రటరీ డి.అనిల్, న్యూ డ్రీమ్స్ పాఠశాల ప్రిన్సిపాల్ పెంటాజీ, డైరెక్టర్ బి. రాజు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment