11 ఏళ్లుగా నాతో కూడా ఫుట్బాల్ ఆడుకున్నారు – రాజాసింగ్
కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫుట్బాల్ బహుమతిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.
ఆయన మాట్లాడుతూ –
➡️ రానున్న రోజుల్లో మరెంతో మంది బీజేపీ నాయకులు కూడా ఫుట్బాల్ బహుమతులు ఇస్తారని వ్యంగ్యంగా అన్నారు.
➡️ “11 ఏళ్లుగా పార్టీలోని పెద్ద నాయకులు నాతో కూడా ఫుట్బాల్ ఆడుకున్నారు” అని వ్యాఖ్యానించారు.
➡️ సీనియర్ నాయకులకు టిక్కెట్లు ఇవ్వకుండా, అడ్డమైన వారిని పార్టీలోకి ఎందుకు తీసుకుంటున్నారు అని ప్రశ్నించారు.
➡️ తెలంగాణలో బీజేపీని కాపాడాలని జాతీయ స్థాయి నాయకులను వేడుకున్నట్లు తెలిపారు.