తెలంగాణ భవన్‌లో హరీష్ రావు చిట్ చాట్ – రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు

Alt Name: Harish Rao Criticizes Telangana Congress Government

హైదరాబాద్: అక్టోబర్ 16
మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ నిలబెట్టుకోలేదని విమర్శిస్తూ, ముఖ్యంగా బతుకమ్మ చీరలు, రైతు బంధు సహాయాలు, కేసీఆర్ కిట్ వంటి పథకాలపై తమ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు.

హరీష్ రావు ప్రసంగంలో ముఖ్యాంశాలు:

  • “రెండు చీరలు ఇస్తామన్న వాగ్దానాలు తీరలేదు. బతుకమ్మ చీరలను కూడా రద్దు చేశారు.”
  • “రైతు బంధు రూ.10,000 పెంచుతామన్న మాట నిలుపుకోలేదు.”
  • “కేసీఆర్ కిట్‌ను కూడా రద్దు చేశారు.”
  • “చేప పిల్లలను చెరువుల్లో వదలక, ముదిరాజ్‌లకు, గంగపుత్రులకు అన్యాయం చేస్తున్నారు.”

రీజనల్ రింగ్ రోడ్:

  • భూసేకరణ కోసం ప్రతిపాదించిన నిధులను వెనక్కు తీసుకువచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా హరీష్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు.
  • “దక్షిణ భాగం అలైన్మెంట్ మార్చడం వల్ల ప్రాజెక్టు ఖర్చు 20 వేల కోట్లకు పెరిగింది,” అని చెప్పి, ప్రజలపై భారాన్ని మోపారని విమర్శించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment