ఏపీ కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా❓

ఏపీ కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా❓

ఏపీ కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా❓

మనోరంజని  ప్రతినిధి

అమరావతి :జనవరి 23
ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా,నియమితులయ్యే అవకాశం ఉంది, 1992 బ్యాచ్ కీ చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, విభాగంలో డైరెక్టర్ జనరల్ గా బాధ్య తలు నిర్వహిస్తున్నారు.

ఏపీలో కొత్త డీజీపీ ఎవరనే చర్చ జోరుగా నడుస్తోంది. నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమి తులయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ దగ్గర పడుతుం డటంతో కొత్త డీజీపీ ఎవరనే చర్చనే జోరుగా సాగుతుంది.

సార్వత్రిక ఎన్నికల సమ యంలో హరీష్‌ గుప్తాను ఎన్నికల సంఘం డీజీపీగా నియమించింది. దీంతో కొన్నిరోజుల పాటు ఆయన ఆ పోస్టులో కొనసాగారు.

రాజకీయ ఆరోపణల నేపథ్యంలో అప్పటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఈసీ బదిలీ చేసింది. ఆయన స్థానంలో హరీష్‌ కుమార్ గుప్తాను ఎంపిక చేసింది. సీనియార్టీలో ద్వారకా తిరుమల రావు, హరీశ్ కుమార్ గుప్తా, మాదిరెడ్డి ప్రతాప్ ల పేర్లను అప్పటి ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఈసీకి సూచించారు.

ఇందులో సీనియర్ ఐపీఎస్, 1992 బ్యాచ్ కు చెందిన హరీశ్ కుమార్ గుప్తా పేరును ఈసీ డీజీపీగా ఎంపిక చేసింది

Join WhatsApp

Join Now

Leave a Comment