నేటి నుంచి ‘హరిహర వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పిరియాడికల్ యాక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే చిత్ర యూనిట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకుల స్పందనను దృష్టిలో ఉంచుకొని, పలు మార్పులతో అప్‌డేటెడ్ వర్షన్‌ను థియేటర్లలో విడుదల చేస్తోంది. అలాగే టికెట్ ధరలు తగ్గించాలని నిర్ణయించింది. కాగా, తెలంగాణలో ఈ తగ్గింపు జూలై 28 నుంచి అమల్లోకి రాగా, ఏపీలో ఆగస్టు 2 నుంచి టికెట్ ధరలు తగ్గించనున్నారు.