కొల్లాపూర్ నియోజకవర్గం:
పెంట్లవెల్లి మండలం కొండూరు గ్రామంలో వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు పాల్గొన్నారు.
వాల్మీకి మహర్షి రాసిన రామాయణం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైందని, మనం ఎలా జీవించాలో నేర్పించిందని పేర్కొన్నారు. కృషి ఉంటే మనుషులు రుషులవుతారని చెప్పేందుకు వాల్మీకి మహర్షి జీవితమే నిదర్శనమన్నారు.
దీక్ష పట్టుదల మరియు స్పందన ద్వారా మహర్షిగా ఎదిగిన వాల్మీకి జీవితం అందరికీ ఆదర్శం అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో:
మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.