హల్దా గ్రామ నివాసి జింకల సందీప్‌కు లక్ష రూపాయల సీఎంఆర్ఎఫ్ సహాయం
ప్రాణాంతక వ్యాధులతో బాధపడే నిరుపేదలకు భరోసాగా సీఎం సహాయ నిధి
మనోరంజని ప్రతినిధి కుబీర్ ఆగస్టు 04
ప్రతి ఒక్కరు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా, హార్ట్, కిడ్నీ, కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడే నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ (CMRF) ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఈ క్రమంలో కుబీర్ మండలం హల్దా గ్రామానికి చెందిన జింకల సందీప్కు సీఎంఆర్ఎఫ్ నిధుల కింద లక్ష రూపాయల చెక్కును ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ: “వైద్య ఖర్చుల భారం భరించలేని పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ ఒక ఆశాజ్యోతి. అవసరమైన వారికి సకాలంలో ఈ నిధులు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రజల ఆరోగ్యమే మా ప్రాధాన్యత,” అని పేర్కొన్నారు.