లోక కళ్యాణార్ధం బాసర నుండి మహాపాదయాత్ర గురుస్వామి సునీల్ దత్

లోక కళ్యాణార్ధం బాసర నుండి మహాపాదయాత్ర

గురుస్వామి సునీల్ దత్

ముధోల్ మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 11

దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి సన్నిధి నుండి కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమలై వరకు 45 రోజుల మహా పాదయాత్ర ఈనెల 12 నుండి వచ్చేనెల 25 వరకు కొనసాగుతుంది. సునీల్ దత్ గురుస్వామి ఆధ్వర్యంలో మహాపాదయాత్ర లోక కళ్యాణార్థం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు గురుస్వామి తెలిపారు. మహాపాదయాత్రలో భాగంగా దాదాపు 60 మందికి పైగా స్వాములు భాగస్వామ్యం కానున్నారని పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment