గాడి తప్పుతున్న ప్రభుత్వ విద్యా వ్యవస్థ..!!
– ఉపాధ్యాయులు లేక ప్రశ్నార్థకంగా మారిన విద్యార్థుల జీవితాలు
– ఉండి లేనట్టుగా వ్యవహరిస్తున్న మండల విద్యాధికారి విజయ్ కుమార్
– ఉపాధ్యాయులను నియమించాలని స్కూలుకు తాళం వేసి సాగ్వి గ్రామస్తుల నిరసన
– స్కూల్ కు తాళం ఎందుకు వేశారంటూ బెదిరింపులకు పాల్పడ్డ అధికారులు, మీడియా వారికి చెప్పొద్దంటూ ఆంక్షలు
– విద్యాధికారుల పనితీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
– మండల విద్యార్థిని సస్పెండ్ చేయాలంటూ వస్తున్న ఆరోపణలు
– గతంలో ఎమ్మెల్యే హెచ్చరించిన ఎంఈఓ విజయ్ కుమార్ మారని పనితీరు
మనోరంజని ప్రతినిధి ఆగస్టు 06
భైంసా: విద్యా వ్యవస్థ గాడి తప్పుతోంది. విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేక విద్యార్థుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని ప్రలోభాలు పలికిన మండల స్థాయి అధికారులు తీరా చూస్తే 55 విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడిని నియమించి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇందుకు నిదర్శనం కుబీర్ మండలంలోని సాగ్వ ప్రభుత్వ పాఠశాలలో 55 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇద్దరు టీచర్లు ఉండగా ఒకరు మేటర్నరీ లీవ్ పెట్టి వెళ్లిపోయారు. 55 మంది విద్యార్థులకు ఓకే టీచర్ ఉండడంతో తమ పిల్లల చదువులు సాగేది ఎట్లా అని బుధవారం స్కూల్ కు తాళం వేసి నిరసన తెలిపారు. ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ విషయం మండల విద్యాధికారి దృష్టికి తీసుకువెళ్లిన ఆయన పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులను నియమిస్తేనే స్కూల్ తాళం తీస్తామని.. అంతవరకు స్కూల్ తాళం తీసే ప్రసక్తే లేదని తెలిపారు. కొన్ని స్కూళ్లలో విద్యార్థులు లేకున్నా ఉపాధ్యాయులను నియమించారు. విద్యార్థులు ఉన్నచోట ఉపాధ్యాయులను మాత్రం పంపడం లేదు. మండల విద్యాధికారి విజయ్ కుమార్ హిస్టరీలో వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి కొందరు టీచర్లు స్కూలుకు పోకుండా చూసి చూడనట్లు ఉంటున్నాడని ఆరోపణలు ఉన్నాయి విద్యార్థుల జీవితాలపై మండల విద్యాధికారికి ఏమాత్రం శ్రద్ధ లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అంతర్నీ గ్రామంలో స్కూల్ బిల్డింగ్ కూలిన సంఘటన మండల విద్యాధికారి నిర్లక్ష్యం వల్లే జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి ప్రమాదం జరగకముందే జిల్లా అధికారులు మండల విద్యాధికారి దృష్టికి తీసుకువచ్చిన ఈయన నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రమాదం సంభవించిందని ఎమ్మెల్యే రామారావు పటేల్ సైతం హెచ్చరించారు. అయినా మండల విద్యాధికారి విజయ్ కుమార్ పనితీరులో మాత్రం మార్పు రావడంలేదని పలువురు మండిపడుతున్నారు. విధులపై నిర్లక్ష్యం వహిస్తున్న ఎంఈఓ విజయ్ కుమార్ ను వెంటనే సస్పెండ్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
– మీడియా వాళ్లకు చెప్పవద్దు………………..
స్కూల్ కు తాళం వేసిన విషయం మీడియా వాళ్లకు చెప్పొద్దని ఎంఈఓ విజయ్ కుమార్ గ్రామస్తులకు బెదిరించినట్లు తెలుస్తోంది. స్కూల్ కు తాళం ఎందుకు వేశారు. అని గ్రామస్తులకు వేధించినట్లు సమాచారం మా పిల్లలు చదువులు సాగేదెట్లా అని గ్రామస్తులు నిరసన తెలపడం తప్ప అని..? విద్యార్థి గారికి ప్రశ్నించారు. మేము అదే పనిలో ఉన్నామని అడ్జస్ట్ చేస్తామని ఎంఈఓ హామీ ఇచ్చారు. కానీ మీరు అలా బెదిరించడం సరికాదని గ్రామస్తులు ఎంఈఓ విజయ్ కుమార్ పై మండిపడ్డారు. బెదిరింపులకు పాల్పడుతున్న మండల విద్యాధికారిపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
గాడి తప్పుతున్న ప్రభుత్వ విద్యా వ్యవస్థ..!!
Published On: August 6, 2025 3:17 pm