కష్టాలను జయించి టీచర్ ఉద్యోగం సాధించిన కంతి అరుణకు ప్రజాసంఘాల శుభాకాంక్షలు

  1. టేకులకోడ్ గ్రామ యువతి కంతి అరుణ ఎస్జీటీ ఉద్యోగం సాధించారు.
  2. ప్రజాసంఘాల నాయకులు ఆమెను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
  3. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రజా సంఘాల నేతలు.

: టేకులకోడ్ గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన కంతి అరుణ డిఎస్సీ పరీక్షలో ఎస్జీటీ ఉద్యోగం సాధించడం పట్ల ఆమెకు ప్రజాసంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సత్కరించి స్వీట్లు పంచి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

 వికారాబాద్ జిల్లా కోడంగల్ మండలం టేకులకోడ్ గ్రామానికి చెందిన కంతి అరుణ డిఎస్సీ పరీక్షలో ఎస్జీటీ ఉద్యోగం సాధించి తన కష్టాన్నిఅధిగమించి టీచర్ ఉద్యోగం పొందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా కమిటీ ఆమెను శనివారం ఆమె గ్రామంలో సన్మానించింది. ఈ కార్యక్రమంలో ఆమెను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. కార్యక్రమంలో టేకులకోడ్ ఎంపిటిసి రాములు, లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు సూర్య నాయక్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు రమేష్ బాబు, టేకులకోడ్ గ్రామ పెద్దలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Comment