ఘనంగా శ్రీ మహాలక్ష్మీ పూజ మహోత్సవం

ఘనంగా శ్రీ మహాలక్ష్మీ పూజ మహోత్సవం

ఎమ్4 ప్రతినిధి ముధోల్

మండల కేంద్రమైన ముధోల్ తో పాటు వివిధ గ్రామాల్లో శ్రీ మహాలక్ష్మి పూజ మహోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. దీపావళి పండుగ కు ముందుగా లక్ష్మీ పూజ మహోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. రాత్రి సమయంలో వ్యాపారస్తులు తమ తమ షాపుల్లో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య లక్ష్మీ అమ్మవారికి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి కరుణా కటాక్షంతో వ్యాపారంలో లాభాలు రావాలని వేడుకున్నారు. అదేవిధంగా ఇళ్లల్లో సైతం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయురారోగ్యాలతో పాటు పంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారికి తీర్థ ప్రసాదాలతో పాటు స్వీట్లు పంపిణీ చేశారు. దుకాణాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వ్యాపార సముదాయం ముందు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment