బీరవెల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పునరుద్ధరణకు నిధులు మంజూరు

బీరవెల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పునరుద్ధరణకు నిధులు మంజూరు

బీరవెల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పునరుద్ధరణకు నిధులు మంజూరు



రూ.69.10 లక్షల నిధులతో పనులు త్వరలో ప్రారంభం – ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి



సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పునరుద్ధరణ, అప్గ్రేడ్ పనులకు రూ.69.10 లక్షల నిధులు మంజూరు అయ్యాయని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ పనులు పూర్తయితే దిగువ ప్రాంత రైతులకు మేలు జరుగుతుందని, త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.



సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామంలోని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పునరుద్ధరణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మొత్తం రూ.69.10 లక్షలతో ఈ ప్రాజెక్టు పునరుద్ధరణ, అప్గ్రేడ్ పనులు చేపట్టనున్నట్లు బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సోమవారం వెల్లడించారు.

ఈ ప్రాజెక్టు పునరుద్ధరణ పూర్తయితే దిగువ ఆయకట్టు రైతులకు సాగునీటి సౌకర్యం లభిస్తుందని, దీని ద్వారా వ్యవసాయ రంగంలో మంచి వృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు. త్వరలోనే పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

ఈ సందర్భంగా పరివాహక ప్రాంత రైతులు, గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment