గ్రామపంచాయతీ మూవీ షూటింగ్….
హీరోయిన్ రాశిపై కీలక సన్నివేశాలు….
తారల రాకతో మండలానికి కొత్త శోభ…
మర్రిగూడ, న్యూస్: గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కుతున్న గ్రామపంచాయతీ మూవీ షూటింగ్ మండలంలో శరవేగంగా సాగుతోంది. సురిగి వెంకట్ శరణ్ గౌడ్ దర్శకత్వంలో రూపు దించుకుంటున్న ఈ మూవీకి సంబంధించిన కీలక సన్నివేశాలు వెంకేపల్లి గ్రామంలో చిత్ర బృందం భారీ సెట్టింగులను ఏర్పాటు చేశారు. సీనియర్ హీరోయిన్ అలనాటి అందాల తార రాశి, హీరోయిన్ దివిజ ప్రభాకర్ లపై దర్శకుడు వెంకట్ పలు సన్నివేశాలు చిత్రీకరించారు. అనంతరం డైరెక్టర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చదువుకున్న యువత గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తే జరిగే పరిణామాలు పెత్తందారులను ఎదిరించి యువత గ్రామ ప్రజలను చైతన్య పరుస్తూ ఎన్నికల్లో ఎలా విజయం సాధిస్తారనే కథాంశంతో సినిమా రూపొందుతుందని ఆయన తెలిపారు. శ్రీకర స్టూడియో బ్యానర్ పై ప్రియతమ్, కో ప్రొడ్యూసర్ శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో, కో- యాక్టర్ నర్సిరెడ్డి, చిత్రం శ్రీను, పెంట్యాల అశ్విని, జబర్దస్త్ యాంకర్ అనసూయ, డిఓపిగా భాస్కర్ చరణ్, తదితరులు పాల్గొన్నారు. దర్శకుడు సురిగి వెంకట్ పోరాటాల జిల్లా నల్లగొండకు చెందినవారు కావడంతో చుట్టుపక్క మండలాల ప్రజలు అలనాటి అందాల తార రాసిని చూడడానికి పరుగులు తీశారు