రైస్ మిల్లుల్లో ధాన్యం దోపిడిని అరికట్టాలి, ధాన్యం కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలి

దుండ్ర కుమార్ యాదవ్ మాట్లాడుతూ

రైస్ మిల్లుల్లో ధాన్యం దోపిడిని అరికట్టాలి, ధాన్యం కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలి

రైతులను ఇబ్బంది పెడుతున్న మిల్లర్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి

ఎన్ హెచ్ ఆర్ సి జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు దుండ్ర కుమార్ యాదవ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి

భూపాలపల్లి టౌన్: ఆరుగాలం శ్రమించి వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పండించిన వరి ధాన్యాన్ని మిల్లర్ల వద్దకు అమ్మకానికి పోతే మిల్లర్లు ధాన్యంలో కటింగ్ ల పేరిట రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు దుండ్ర కుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క కిలో కూడా కోత విధించడానికి వీలులేదని ఒక ప్రక్క ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్వింటాల్కు ఆరు నుంచి పది కిలోల వరకు కటింగ్ చేస్తూ మిల్లర్లు అధికారుల ఆదేశాలను తుంగలో తొక్కుతున్నారని ఆయన అన్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు, సివిల్ సప్లై అధికారులు ప్రత్యేక చొరవ చూపి రైతులకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ రైతులను దగా చేస్తున్న రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎఫ్ ఏ క్యు నిబంధనల మేరకే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నప్పటికీ మిల్లర్ల వద్దకు పోయేసరికి మళ్లీ కోతలు విధించడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న రైస్ మిల్లులను వెంటనే సీజ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కొంతమంది అవినీతి అధికారుల అండదండలతోటే మిల్లర్ల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయని ఆయన అన్నారు. దేశానికి వెన్నెముక ఆయిన అన్నదాతలను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని లీగల్ గా మిల్లులపై చర్యలు తీసుకునే విధంగా పోరాటం చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఈ విషయంలో జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య సార్ ఆధ్వర్యంలో మిల్లర్ల బాగోతాలను బహిర్గతం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కార్యచరణను రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే చాలా సమాచారం సేకరించామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్లు, సివిల్ సప్లై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని, ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి బూర ముక్తేశ్వర్, జిల్లా ప్రచార కార్యదర్శి శిల్పాక నరేష్, పట్టణ అధ్యక్షులు ఇప్పకాయల రాధాకృష్ణ, రేగొండ మండల అధ్యక్షులు నాంపల్లి వినయ్, ఘనపూర్ మండల అధ్యక్షులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment