నేతాజీ పబ్లిక్ స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే

నేతాజీ పబ్లిక్ స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని కౌట్ల బి గ్రామంలో ఉన్న నేతాజీ పబ్లిక్ స్కూల్లో బుధవారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలు జరిపారు. నర్సరీ నుండి 5వ తరగతి వరకు 2024–2025 విద్యా సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు ప్రోగ్రెస్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా గురుకుల ప్రవేశ పరీక్షల్లో 34 మంది విద్యార్థులు సీట్లు సాధించడంతో వారిని ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా స్కూల్ ప్రధానోపాధ్యాయులు రేగుంట గంగాధర్ మాట్లాడుతూ, విద్యే మనకు అసలైన ఆస్తి అని, విద్యార్థులు పాఠశాలలో విద్యతోపాటు ఆటలు, శారీరక క్రీడల్లోనూ రాణించాలని, తల్లిదండ్రులు పిల్లలను స్కూల్‌కు ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఆడేపు కిష్టయ్య, వైస్ ప్రిన్సిపాల్ చవాన్ ప్రకాష్, ఉపాధ్యాయులు మంగమ్మ, కృపారాణి, సుమలత, సుమప్రియ, పూజ, సోని తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment