*జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి* *టి. డబ్ల్యూ. జె. ఎఫ్. ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కు వినతి*

*జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి*
*టి. డబ్ల్యూ. జె. ఎఫ్. ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కు వినతి*

మనోరంజని తెలుగు టైమ్స్ భైంసా ప్రతినిధి నవంబర్ 21

ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం బైంసాలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ అజ్మీర సాంకేత్ కుమార్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు పుప్పాల దేవిదాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి సహిల్ జావిద్, జిల్లా ఉపాధ్యక్షులు ఆశ మొల్ల మోహన్ మాట్లాడుతూ పాలకులు మారిన జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కావడం లేదని, తక్షణమే ప్రభుత్వం జర్నలిస్టులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా, డివిజన్ మండల కేంద్రాల్లో పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు, ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వానికి ప్రజలకు భారతీయుగా ప్రభుత్వానికి ప్రజలకు వారథిగా నిలిచే జర్నలిస్టు జర్నలిస్టు సంక్షేమం పట్ల ప్రభుత్వాలు దృష్టి సారించాలన్నారు. తక్షణమే రాష్ట్ర జిల్లా స్థాయి అక్కరాష్ట్ర జిల్లా స్థాయి అక్రిడేషన్ కమిటీలు ఏర్పాటుచేసి నూతన అక్రిడేషన్ కార్డులు ఇవ్వాల్సింది గా కోరారు. జర్నలిస్టు కేటాయించిన హెల్త్ కార్డులు ఎందుకు పనికి రావడం లేదని, రాష్ట్రంలో 40 వేల హెల్త్ కార్డులు ఇచ్చారని, వీటిని ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రిలో, పనిచేసేలా చూడాలన్నారు. కార్యక్రమం లో జర్నలిస్ట్ లు చరణ్ రెడ్డి,ప్రకాష్ విలాస్, శ్రీనివాస్, మురళి, మాదరావ్, షకీల్, బషీర్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment