ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
తేదీ: అక్టోబర్ 21
ప్రదేశం: ముధోల్, నిర్మల్ జిల్లా
నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంగళవారం ప్రారంభం కానుంది. ముధోల్-తానూర్-బాసర-లోకేశ్వరం మండలాలకు చెందిన విద్యార్థులకు ఉన్నతమైన విద్య అందించేందుకు ఈ కళాశాల ఏర్పాటు చేయబడింది.
డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎమ్మెల్యే రామారావు పటేల్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, మరియు మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్, విట్టల్ రెడ్డి హాజరవుతారు.
గత ఎన్నో సంవత్సరాల నుండి స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం ప్రయత్నించారు. స్థానికులు మాట్లాడుతూ, ఈ కళాశాల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. డిగ్రీ కళాశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు, రంగులు వేయడంతో పాటు విద్యార్థులు కూర్చోవడానికి బెంచీలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా, గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వసతులు కల్పించడానికి కృషి చేస్తోంది.