తెలంగాణ భూభారతి చట్టానికి గవర్నర్ ఆమోదం

తెలంగాణ భూభారతి చట్టానికి గవర్నర్ ఆమోదం
  • భూభారతి చట్టానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదం
  • ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి చట్టం అమలుకు సిద్ధం
  • భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అని రెవిన్యూ మంత్రి వెల్లడి

 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన భూభారతి చట్టానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ధరణి పోర్టల్ స్థానంలో ఈ చట్టాన్ని తీసుకురావడం ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ చట్ట కాపీని రెవిన్యూ మంత్రికి అందజేశారు. త్వరలోనే ఈ చట్టాన్ని ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు.

 

తెలంగాణలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు తీసుకొచ్చిన భూభారతి చట్టంకి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ చట్టం ద్వారా ప్రస్తుతం ఉన్న ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి చట్టం అమలులోకి రానుంది.

రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ గవర్నర్ ఆమోదం పొందిన భూభారతి చట్టం కాపీని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ధరణి చట్టం వల్ల ప్రజలు, రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వాటికి పరిష్కారం చూపడమే భూభారతి చట్టం లక్ష్యమని తెలిపారు.

ధరణి స్థానంలో భూభారతి చట్టం:

ధరణి పోర్టల్ అనేక సమస్యలకు కేంద్రంగా మారిందని, బీఆర్ఎస్ నేతలకు అనుకూలంగా ఉన్నందున ప్రజలకు ఇబ్బందులు కలిగించిందని మంత్రి విమర్శించారు. దీనికి ప్రత్యామ్నాయంగా, భూభారతి చట్టం భూముల వివరాలను మరింత సులభతరం చేయడమే కాకుండా భూ పరిపాలనలో పారదర్శకతను పెంచుతుందని తెలిపారు.

త్వరలో అమలు:

భూభారతి చట్టాన్ని త్వరలోనే పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఈ చట్టం భూముల సమస్యలను పరిష్కరించడంలో కీలక భూమిక పోషించనుందని అభిప్రాయపడ్డారు.

Join WhatsApp

Join Now

Leave a Comment