ఖానాపూర్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఉదారత
20 మంది మున్సిపల్ కార్మికులకు రేన్ కోట్లు అందజేత
ఖానాపూర్, జూలై 29 (M4News): ఖానాపూర్ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వాల్గోట్ కిషన్ తన సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తూ ఆదర్శంగా నిలిచారు. ఖానాపూర్ మున్సిపాలిటీకి చెందిన 20 మంది మున్సిపల్ కార్మికులకు రేన్ కోట్లు అందజేసి ఉదారతను చాటుకున్నారు.
ఈ మేరకు మంగళవారం (జూలై 29) జరిగిన కార్యక్రమంలో రేన్ కోట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వాల్గోట్ కిషన్ మాట్లాడుతూ, “ప్రతి రోజు తెల్లవారకముందే పట్టణాన్ని శుభ్రంగా ఉంచడంలో కార్మికులు చేస్తున్న సేవలు ప్రశంసనీయం. వర్షాకాలంలో వారు తడవకుండా ఉండేందుకు ఈ రేన్ కోట్లు అందజేశాను” అని తెలిపారు.
కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, మున్సిపల్ సిబ్బంది సురేందర్, ఫిరోజ్, శంకర్, చేతన్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులు ఉపాధ్యాయుడు చేసిన ఈ సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు.