మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ విజయ్ కిరణ్ కర్

ఎమ్4 ప్రతినిధి ముధోల్

మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ విజయ్ కిరణ్ కర్ అన్నారు. గురువారం మండల కేంద్రమైన ముధోల్ లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో మండలంలోని మత్స్యకారులకు చేప పిల్లలను ఎంపీడీవో శివకుమార్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 19 గ్రామ పంచాయతీ పరిధిలోని 69 చెరువుల్లో మత్స్యకారులకు 15 లక్షల 18 వేల చేప పిల్లలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. గ్రామాల్లో ఇంకా చెరువులు ఉంటే రెవెన్యూ అధికారుల నుండి ధ్రువీకరణ పత్రం తీసుకొని అందిస్తే వాళ్లకు సైతం వారం రోజుల్లో చేప పిల్లలను అందిస్తామన్నారు. ప్రభుత్వం నాణ్యమైన చేప పిల్లలను మత్స్యకారులకు అందించి వారి ఆర్థిక అభ్యున్నతికి తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. మత్స్యకారులు ప్రభుత్వ పరంగా అందిన చేప పిల్లలను చెరువుల్లో విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘం సభ్యులు ఫీల్డ్ మెన్ కె.రాజేందర్, మత్స్యకారులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment