తెలంగాణ ముస్లిం ఏక్తా సంఘానికి ప్రభుత్వ సహకారం
— ఎంబడి రాజేశ్వర్, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
నిర్మల్, డిసెంబర్ 31 (మనోరంజని తెలుగు టైమ్స్):
తెలంగాణ ముస్లిం ఏక్తా సంఘానికి ప్రభుత్వ పరంగా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్, తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మూడు నెలల ఫ్యాషన్ డిజైనింగ్ (టైలరింగ్) శిక్షణ కార్యక్రమం నిర్వహించగా, శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు శుక్రవారం నిర్మల్ పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం హాల్‌లో సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంబడి రాజేశ్వర్ మాట్లాడుతూ, మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉపాధి నైపుణ్య శిక్షణలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ రాష్ట్ర సభ్యులు ముఫ్తీ ఇలియాస్, సొసైటీ గౌరవ అధ్యక్షులు హబీబ్ జిలాని, వసీం షకిల్, అమీన్ పటేల్, మోసిన్ చౌశ్, బ్లడ్ బ్యాంక్ ఇన్‌చార్జ్ మన్సూర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు జావిద్, సొసైటీ ఉపాధ్యక్షులు సాజిద్, అఫ్రోజ్ పాషా ఖాన్, అమన్, జుబేర్, ఇమ్రాన్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు జాఫర్, నవీద్, అర్షద్ తదితరులు పాల్గొన్నారు.