ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు
డాలర్ విలువ పతనం కారణంగా బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ ఆల్ టైం రికార్డులకు చేరువవుతున్నాయి. ఆదివారం తులం బంగారం ధరపై రూ.1500పైగా పెరిగి, దేశీయంగా రూ.1,15,480 వద్ద కొనసాగుతోంది. ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బంగారం ధరలు భారీగా పెరగడంతో ఆభరణాల కొనుగోళ్లు గణనీయంగా తగ్గాయి, సామాన్యులకు బంగారం కొనడం కష్టతరంగా మారింది. వెండి ధర కూడా కిలో రూ. 1.49 లక్షలకు చేరింది