చీఫ్ మినిస్టర్ కప్ రాష్ట్ర స్థాయి వుషు క్రీడా పోటీలలో నిర్మల్ జిల్లాకు బంగారు పతకాలు

: చీఫ్ మినిస్టర్ కప్ వుషు పోటీల్లో పతక విజేతల సన్మానం

చీఫ్ మినిస్టర్ కప్ రాష్ట్ర స్థాయి వుషు క్రీడా పోటీలలో నిర్మల్ జిల్లాకు బంగారు పతకాలు

: చీఫ్ మినిస్టర్ కప్ వుషు పోటీల్లో పతక విజేతల సన్మానం

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
నిర్మల్ : డిసెంబర్ 30

: చీఫ్ మినిస్టర్ కప్ వుషు పోటీల్లో పతక విజేతల సన్మానం

స్పోర్ట్స్ అథారిటీ అఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో డిసెంబర్ 27 నుండి 29 వరకు హైదరాబాద్ లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన చీఫ్ మినిస్టర్ కప్ వుషు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో నిర్మల్ జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేశారు. ఖేలో ఇండియా వుషు శిక్షణ కేంద్రం నుండి 18 మంది క్రీడాకారులు పాల్గొనగా, వారిలో 8 మంది పతకాలు సాధించారు.

: చీఫ్ మినిస్టర్ కప్ వుషు పోటీల్లో పతక విజేతల సన్మానం

పతక విజేతలు:

  1. అబ్దుల్ రహమాన్ (సభ్-జూనియర్స్ బాయ్స్, -24 కేజీ) – బంగారు పతకం
  2. రాథోడ్ కృష్ణా (సభ్-జూనియర్స్ బాయ్స్, -36 కేజీ) – బంగారు పతకం 
  3. ఎల్. మమత (సభ్-జూనియర్స్ గర్ల్స్, -36 కేజీ) – బంగారు పతకం 
  4. డి. రాజేశ్వరి (సభ్-జూనియర్స్ గర్ల్స్, -33 కేజీ) – వెండి పతకం 
  5. కె. పల్లవి (జూనియర్స్ గర్ల్స్, -48 కేజీ) – వెండి పతకం 
  6. ఎన్. రుద్ర (సభ్-జూనియర్స్ బాయ్స్, -21 కేజీ) – వెండి పతకం 
  7. శ్రేయన్ కార్తీకేయ (సభ్-జూనియర్స్ బాయ్స్, -30 కేజీ) – రజత పతకం 
  8. ఆర్. కళ్యాణి భాయ్ (జూనియర్స్ గర్ల్స్, -52 కేజీ) – రజత పతకం 

: చీఫ్ మినిస్టర్ కప్ వుషు పోటీల్లో పతక విజేతల సన్మానం

సన్మానం మరియు ర్యాలీ:

పతక విజేతలకు భైంసా బస్టాండ్ నుండి ఖేలో ఇండియా కోచింగ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సన్మాన కార్యక్రమంలో భైంసా పట్టణ సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, సుమన్ టీవీ నిర్మల్ యజమాన్యం ముద్దం విక్రమ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను, కోచ్‌లను అభినందించారు.

క్రీడాకారుల ప్రేరణ:

ఈ విజయాలు ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తాయని ఖేలో ఇండియా వుషు కోచ్‌లు సాయి కృష్ణ, జ్ఞాన తేజ, సాయినాథ్, మరియు తల్లిదండ్రులు తెలిపారు. రజత మాట్లాడుతూ మరింత ప్రోత్సాహం మరియు ఆర్థిక సహాయం లభిస్తే మరింత ప్రతిభ కనబర్చగలమన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment