కూతురు పుట్టినరోజున పేదలకు అన్నదానం
మనోరంజని ( ప్రతినిధి )
భైంసా : డిసెంబర్ 12
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని కాలోనికి చెందిన నాగేష్- మమత దంపతులిద్దరూ తమ కుమార్తె హన్షు పుట్టిన రోజును పురస్కరించుకొని ఎలాంటి వృధా ఖర్చులకు పోకుండా పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పేదలు అన్నదానం స్వీకరించిన తర్వాత ఇచ్చే ఆశీస్సులు దైవ ఆశీస్సులుగా భావించి పై కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు తమ వంతు సామాజిక బాధ్యతగా పేదలకు -అనాధలకు సహాయ సహకారాలు అందించాలని సూచించారు